పీఎం కిసాన్: 8వ విడత డబ్బులు ఈ నెలలో రానట్టేనా..?

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే వీటిలో రైతుల కోసం పలు స్కీమ్స్ కూడా వున్నాయి. దీనిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. దీని వలన అనేక మంది రైతులు బెనిఫిట్స్ ని పొందుతున్నారు.

ప్రభుత్వం నుండి ఆర్థిక చేయూత ఈ పధకం ద్వారా లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రతి ఏడాది రూ.6 వేలు వస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతా కి నేరుగా వేస్తారు. ఇవి ఏడాదికి మూడు విడతల్లో వస్తాయి. అంటే రూ.2 వేల చొప్పున వాళ్ళకి వస్తాయి.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 7 విడతల డబ్బును రైతుల కి అందించింది. అయితే ఇప్పుడు 8వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ రూ.2 వేలు ఎప్పుడు రైతుల అకౌంట్లలోకి ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ లేదు. 8వ విడత డబ్బులపై వివరణ కూడా లేదు.

అయితే ఏప్రిల్ నెల చివరికి వచ్చే అవకాశం వుంది అని అన్నారు కానీ… ఇప్పుడు ఏప్రిల్ నెల లో కాకుండా మే నెలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని తెలుస్తోంది. కానీ దీని పై క్లారిటీ మాత్రం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news