ఒక బెడ్ కోసం ఆరు ఆస్పత్రులు… దేశ రాజధానిలో దారుణం…!

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి. అక్కడ కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే ఒక బెడ్ కోసం ఆరు ఆస్పత్రులు తిరిగే పరిస్థితి వచ్చింది. రమేష్ భాటియా అనే వ్యక్తికి బెడ్ కోసం ఆరు ఆస్పత్రులు తిరిగినా సరే ఫలితం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే తమను టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పారని రమేష్ కుమార్తె ఆవేదన వ్యక్తం చేసారు.

ఆక్సీజన్ రీఫిల్లింగ్ స్టేషన్ బయట తాము ఆక్సీజన్ కోసం ప్రయత్నం చేసామని అయినా సరే అక్కడ కూడా ఆక్సీజన్ దొరకలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆటోలో ఆక్సీజన్ కోసం తిరిగామని, తన తండ్రిని పెట్టుకుని నగరం మొత్తం తిరిగినా సరే తమకు బెడ్ గాని ఆక్సీజన్ గాని దొరకలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.