బక్రీద్ భక్తికి, విశ్వాసానికి ఈ పర్వదినం సంకేతం: మోదీ

-

న్యూఢిల్లీ: భక్తికి విశ్వాసానికి ఈ పర్వదినం సంకేతమని ప్రధాని మోదీ అన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర భావం, ఐక్యతకు ఈ పండుగ అదర్భంగా నిలుస్తుందన్నారు.

 

ఇవాళ బక్రీద్ సందర్బంగా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని వేడుకున్నారు.

 

కాగా దేశ వ్యాప్తంగా బక్రీద్ పండుగ ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఉపవాస దీక్షలు విరమించి ఖుర్భానీ చేస్తున్నారు. బక్రీద్ సందర్బంగా ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. ఇస్లామిక్, క్రైస్తవ, యూదు గ్రంథాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం(ఇబ్రహీం) తన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణత్యాగానికి బదులు ఓ జీవాన్ని బలివ్వాలని చెబుతారు. దీంతో అప్పటి నుంచి బక్రీద్ సందర్భంగా జీవాన్ని బలిచ్చి ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధువులకు , మూడో భాగాన్ని కుటుంబానికి వినియోగిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news