గత 24 గంటల్లో 3,998 మరణాలు…41 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్..!

కరోనా తగ్గుముఖం పడుతోంది అనుకుంటే మరో సారి మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అదే విధంగా మరణాలు కూడా వేలల్లో నమోదవుతున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ముఖ్యం.

గత 24 గంటల కరోనా వైరస్ అప్డేట్స్ గురించి చూసేస్తే… గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 3998 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 418480 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది. అలానే గత 24 గంటల్లో 42,015 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక వ్యాక్సినేషన్ గురించి చూస్తే… ఇప్పటికి 41 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీటి వివరాలని చూస్తే.. ఇక గత 24 గంటల్లో 34,25,446 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఇప్పటికి మొత్తం 41,54,72,455 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో అలానే ఇంకా 407170 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే గత 24 గంటల్లో మరో 36977 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30390687 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది.