నేను ఒక్కన్నే కాదు..130 కోట్ల భార‌తీయుల ప్ర‌తినిధిగా వ‌చ్చా- ప్ర‌ధాని మోడీ

దీపావళి పండుగ దినం సందర్భంగా… దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… ఇవాళ జమ్మూ కాశ్మీర్‌ లోని.. నౌషేరా సెక్టార్‌ లో పర్యటించారు. ఈ పర్యటనలో… జవాన్ల తో ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్కడినే రాలేదని.. 130 కోట్ల భారతీయుల ప్రతి నిధిగా వచ్చానని ప్రధాని మోడీ… అన్నారు.

సైనికులతో…. దీపావళి జరుపు కోవడం సంతోషంగా ఉందన్నారు. 2014 సంవత్సరం నుంచి… ఏటా జనాన్ల తో… దీపావళి పండుగ జరుపుకుంటున్నానని తెలిపారు మోడీ. మన జవాన్లు… శత్రువులకు ధీటైన జవాబిస్తున్నారని వెల్లడించారు. మీ సాహసాలు దీపావళి వేడుకలకు మరింత వన్నె తెచ్చాయని తెలిపారు. మీ వల్లే.. ప్రజలంతా సుఖంగా నిద్ర పోతున్నారని వెల్లడించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారిని ప్రజలంతా ఏకమైన తరమి కొట్టాలని పిలుపు నిచ్చారు.  అందరూ ఏకమైతేనే…  కరోనా పై విజయం సాధిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.