అయ్యో మోదీ.. అలా ప‌డిపోయారేంటి: (వైర‌ల్ వీడియో)

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదీలో పర్యటించారు. అయితే ఈ విహారానికి ముందు ఆయన మెట్లు ఎక్కుతూ జారి పడ్డారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. కాన్పూర్ లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది.

ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు, మోదీని పట్టుకుని లేపారు. ‘నమామి గంగే’ ప్రాజెక్టులో భాగంగా గంగా కౌన్సిల్ సమావేశాన్ని కాన్పూర్ లో ఏర్పాటు చేయగా, దీనిలో పాల్గొనేందుకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు హాజరైన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ కాలు జారిన వీడియోను మీరూ చూడవచ్చు.