ఆ వీడియో నేనూ ఎంజాయ్ చేశా.. ట్రోల్ పై ప్రధాని మోదీ ట్వీట్

-

సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఆరోపణలు, విమర్శలు సహజం. ఇక వ్యక్తిగత విమర్శలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇక సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం, ట్రోలింగ్ మామూలుగా లేదు. ఆకరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్రోలర్స్ వదల్లేదు. ఇప్పటికే మోదీపై ఏఐతో వాయిస్ ఇమిటేషన్ వీడియోస్, రీల్స్ చాలా వచ్చాయి. అయితే తాజాగా ఏకంగా మోదీ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది కాస్త ప్రధాని దృష్టికి వచ్చింది. దానిపై మోదీ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?

కృష్ణ అనే వ్యక్తి ఎక్స్‌లో తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ప్రధాని మోదీ రూపంలో ఉన్న వ్యక్తి స్టేజీపై డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోకు క్యాప్షన్‌ రాస్తూ.. ప్రధాని మోదీని నియంతతో పోల్చాడు. ఇక మోదీ ఈ పోస్ట్‌ను రీపోస్ట్‌ చేయడమే కాకుండా ‘మీ లాగే నేనూ నా డ్యాన్స్‌ చూసి ఎంజాయ్‌ చేశా’ అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు. ఎన్నికల వేళ ఇలాంటి సృజనాత్మకత సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రధానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. ‘కూలెస్ట్‌ పీఎం’ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news