నేడు ఉజ్జ్వల యోజన 2.0 ని ప్రారంభించనున్న పీఎం మోడీ… స్కీమ్ వివరాలివే..!

-

నేడు అనగా ఆగస్టు10 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉజ్జ్వల యోజన రెండో దశను ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా పేద మహిళలకి LPG కనెక్షన్లను పంపిణీ చేస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా PMUY పథకం లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. ఇది ఇలా ఉంటే కోట్ల BPL కుటుంబాలకు చెందిన మహిళలకు LPG కనెక్షన్‌లను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏది ఏమైనా ఏప్రిల్ 2018 లో ఈ పథకం విస్తరించారు. దీనిలో మరో ఏడు వర్గాల వారికి (SC/ST, PMAY, AAY, అత్యంత వెనుకబడిన తరగతులు, టీ గార్డెన్స్, అటవీ నివాసులు, ఐలాండ్స్) అవకాశం కల్పించారు.
అలానే దీని లక్ష్యం 8 కోట్ల LPG కనెక్షన్‌లకు మార్చడం జరిగింది. అయితే అనుకున్న దానికి ఏడు నెలల ముందుగానే అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యం చేరుకోవడం జరిగింది.
అదే విధంగా ఉజ్వల 2.0 కింద ఉచిత LPG కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ అందించడం జరుగుతుంది.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌లో PMUY పథకం కింద ఒక కోటి అదనపు LPG కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news