తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం గ్రామాలకు పిడుగు హెచ్చరిలు జారీ చేశారు.

పశ్చిమగోదావరిలోనినల్లజేర్ల,తాడేపల్లిగూడెం,కొయ్యలగూడెం,దేవరపల్లి,చాగల్లు,నిడదవోలు,పెంటపాడు,తణుకు,ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం,అత్తిలి,పెనుమంట్ర,ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో సైతం పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని వాతావరణ శాక హెచ్చరించింది. కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఇక పిడుగు హెచ్చరికలు జారీ చేయడంతో రెండు జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.