కరోనాపై ఆవేదనగా ట్వీట్ చేసిన మోడీ…!

-

దేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు లాక్ డౌన్ దిశగా అడుగులు వేసాయి. లాక్ డౌన్ ని కచ్చితంగా అమలు చెయ్యాలని చూస్తున్నాయి అన్ని రాష్ట్రాలు. జనతా కర్ఫ్యూ ముగింపు సందర్భంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ని ప్రకటించాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కచ్చితంగా లాక్ డౌన్ ని అమలు చెయ్యాలని ప్రజలను కేంద్రం కోరింది.

అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రజలు అయితే అసలు పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకోవడం లేదని మోడీ ట్వీట్ చేసారు. ప్రభుత్వ ఆదేశాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. ప్రతీ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించారు.

అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా లాక్ డౌన్ ని అమలు చెయ్యాలని మోడీ సూచించారు. మన కోసం మన అందరి కోసం లాక్ డౌన్ అని మోడీ వివరించారు. ఇక ఇదిలా ఉంటే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 400 వరకు ఉంది. 8 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ముగ్గురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసి వేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news