PMSBY: ఏడాదికి రూ. 20లతో బీమా.. జీవితానికి ఎంతో సురక్ష..!

-

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో…ఎవరూ ఊహించలేరు. మన మీద ఆధారపడిన వారికి మనమే అన్నీ.. సడన్గా జరగకూడనిది జరిగితే..కుటుంబం అనాథగా మిగలాల్సిందే.. అందుకే ముందే బీమా చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో బీమా పథకాలను అందిస్తుంది. అతి తక్కువ ప్రీమియంతో.. బీమ సదుపాయాలు కల్పించింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఈ పథకాల గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడమే.. ఈరోజు అలాంటి గుర్తెరగని ఓ పథకం గురించి మీకు తెలియజేయబోతున్నాం..! అదేంటంటే..

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ఒకటి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడంతో పాటు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వారికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యెజన పథకాన్ని ప్రవేశపెట్టింది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే వ్యక్తి ఏడాదికి రూ. 20 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో చేరే వ్యక్తులు బ్యాంకులో సేవింగ్ ఖాతా కలిగి ఉండాలి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అధికారిక వెబ్ సైట్ లేదా ఇక్కడ లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్ సైట్ ని సందర్శించి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారం పొందవచ్చు. అప్లికేషన్‌లో పొందుపర్చిన వివరాలు పూర్తిచేస.. అవసరమైన డాక్యుమెంట్ల నకలు జతపరచి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కోసం అకౌంట్ లోనుంచి రూ.20 తీసుకుంటారు.

ఎవరు అర్హులు: 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2,00,000 ఆర్థిక సాయం అందిస్తారు.. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష ఆర్థిక సాయం లభిస్తుంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు.

క్లెయిమ్ చేసే విధానం- ఈ పథకంలో చేరిన లబ్ధిదారు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి యొక్క నామినీ బ్యాంకు, బీమా కార్యాలయానికి వెళ్లి క్లెయిమ్ ఫారమ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది.. బీమా చేయబడిన వ్యక్తి తన పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు శాఖలో బీమా చేయబడిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా కవర్ మొత్తం నామినీ ఖాతాలోకి బదిలీ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news