న్యూమోనియా వచ్చే అవకాశం వీరిలో ఎక్కువ..? ఈ జాగ్రత్తలు మరవద్దు..!

-

న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక తీవ్రమైన వ్యాధి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరిని ఇది వదిలిపెట్టదు. గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వంటి సమస్యలను కలిగి ఉన్నవారిలో సాధారణంగా వస్తుంది. ఈరోజు ఈ వ్యాధి ఎవరికి ఎక్కువ వస్తుంది, కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ లుక్కేద్దామా.!

ఎవరికి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది..?

గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వంటి వైద్య సమస్యలను కలిగి ఉన్నవారిలో సాధారణంగా వస్తుంది. అలాగే ఆసుపత్రిలో చేరిన రోగులు, ఎక్కువ కాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన వారికి ,ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులకు, హెచ్ ఐవి,ఎయిడ్స్, క్యాన్సర్, అవయవ మార్పిడి చికిత్సలు పొందిన వారికి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా
న్యూమోనియా బారినపడే అవకాశాలు ఉంటాయి.

కారణాలు..

వైరస్లు, బ్యాక్టీరియా కొన్నిసార్లు శిలీంధ్రాలు వంటి వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల న్యుమోనియా వస్తుంది.
న్యుమోనియాకు అత్యంత సాధారణ బ్యాక్టీరియా కారణంగా చెప్పవచ్చు. దీనినే స్ట్రెప్టోకోకస్ న్యుమోనియాగా పిలుస్తారు..
హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా, లెజియోనెల్లా న్యుమోఫిలా, స్టెఫిలోకాకస్ ఆరియస్ ఇతర బాక్టీరియా. మైకోప్లాస్మా వంటి ఇతర బ్యాక్టీరియా తేలికపాటి న్యుమోనియాకు కారణమవుతాయి.

లక్షణాలు

కఫంతో కూడిన దగ్గు, చలిజ్వరం, ఛాతీనొప్పితో, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, బలహీనంగా, నీరసంగా, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించటం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

న్యూమోనియా అంటువ్యాధా..?

న్యుమోనియా అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల క్రిములు మనం పీల్చే గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోటిని కవర్ చేసుకోవాలి. వ్యాధితో బాధపడుతున్నవారు ప్రత్యేక ప్లేట్లు, కప్పులు ఇతర పాత్రలను ఉపయోగించడం మంచిది. సామాజిక దూరం పాటించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నీరు, సూప్‌లు, టీ తాగటం మంచిది.
తేనె, కొన్ని చుక్కల నిమ్మకాయతో తయారు చేసిన వెచ్చని పానీయం ఉపశమనం కలిగిస్తుంది.
తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
అలసటకు గురయ్యే పనులు చేయకూడదు.
సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఏమాత్రం అశ్రద్ధ మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news