తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రకటించారు. దీంతో శాసన సభలోని సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… పోచారం వివాద రహితుడని పేర్కొన్నారు. మీమంతా శ్రీనివాస్ రెడ్డిని మిస్ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భావోద్వేగానికి గురైన కేసీఆర్..
పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు తెలంగాణ రెండో స్పీకర్‌గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత సభా నాయకుడి హోదాలో కేసీఆర్ ప్రసంగిస్తూ… సానుకూల వాతావరణంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే ఉద్దేశంలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చలు జరిపామని.. ఇందుకు వారంతా సహకరించారని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఓ దశలో ఆయన భావోద్వేగానికి గురైయ్యారు. ఈ సందర్భంగా ఆయన గత విషయాలను గుర్తుకు చేసుకుంటూ… తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరి.. ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారన్నారు.తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మిమ్మల్ని.. రెండో విడత మంత్రిమండలిలో మిస్ అవుతున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. పోచారంలాంటి స్నేహపూర్వక, మిత్రుడు అన్ని పార్టీల నేతలను కలుపుకు పోయే మనస్తత్వంగల నేతగా ఆయన పేర్కొన్నారు.