అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో పోకో ఎం2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..!

-

మొబైల్స్ త‌యారీదారు పోకో.. భార‌త్‌లో పోకో ఎం2 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను మంగ‌ళ‌వారం విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 720జి లేటెస్ట్ ప్రాసెస‌ర్‌, 6జీబీ వ‌ర‌కు ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌, 5 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫోన్‌కు సైడ్ భాగంలో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. వెనుక భాగానికి కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ఉంది. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, సిమ్ కార్డుల కోసం ప్ర‌త్యేకంగా విడివిడిగా స్లాట్ల‌ను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ గల బ్యాట‌రీ ఈ ఫోన్‌లో ఉంది. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల కేవ‌లం 30 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 0 నుంచి 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది. ఈ ఫోన్‌కు ఫాస్ట్ చార్జ‌ర్‌ను అందిస్తున్నారు.

POCO M2 Pro smart phone launched in India

పోకో ఎం2 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 720జి ప్రాసెస‌ర్
* 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10.0, 48, 8, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

పోకో ఎం2 ప్రొకు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.13,999గా ఉంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999గా ఉంది. జూలై 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడ‌ల్స్‌ను విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news