వరంగల్: సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు వరంగల్‌ను అష్టదిగ్బంధం చేశారు. నగరానికి వచ్చే అన్నిదారులను మూసేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చేదుఅనుభవం ఎదురైంది. కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వాహనాన్ని కూడా అడ్డుకన్నారు. ఎంతకీ అనుమతించలేదు. దీంతో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రగా మంత్రి కార్యాలయానికి వెళ్లారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.
మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కలరపత్రాలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే నరేందర్ కబ్జాలకు పాల్పడ్డారంటూ గుర్తు తెలియని వ్యక్తులు న్యూస్ పేపర్‌లో పెట్టి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీ ఫారమ్స్‌ను రూ. 50 లక్షలకు అమ్ముకున్నాడని, గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు వసూలు చేశారని కరపత్రాల్లో పేర్కొన్నారు. వరంగల్ తూర్పులో భూకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ అంటూ ఘాటుగా కర్రపత్రాల్లో రాసి ఉంది.