
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ మోకా భాస్కరరావు హత్యకు గురైన విషయం తెలిసిందే.. కాగా ఆ కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర ను లో పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుండి తుని వెళ్ళే దారిలో తూర్పు గోదావరి జిల్లాలోని తుని మండలం సీతారాంపురంలో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు.
వివరాల్లోకి వెళితే… మోకా భాస్కర రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆయన పేరును కూడా ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొల్లు రవీంద్ర తన నివాసం నుండి పరారయ్యారు. ఆయన అజ్ఞాతం లోకి వెళ్లారని తన నివాసం లో లేడని తెలుసుకున్న పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవీంద్ర ఇంట్లో కూడా సోదాలు జరుపగా అక్కడ ఆయనకు సంబంధించిన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆయన కోసం గాలింపు చేస్తున్న పోలీసులకు ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని తుని మండలం సీతారాంపురంలో పోలీసులకు చిక్కాడు దీంతో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ కు తరలించారు.