అలా తాళి కట్టాడు ఇలా అరెస్ట్ చేసారు, కరోనా పుణ్యమే

ఒక పక్కన కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నా సరే కొందరిలో మార్పు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా పంజాబ్ లో ఒక పార్టీకి సంబంధించి పోలీసులు షాక్ ఇచ్చారు. అక్కడ వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి పంజాబ్‌లోని జలంధర్‌లో పెళ్లి చేసుకుని హడావుడి చేసాడు. జలంధర్‌లోని ఒక ఆలయంలో జరిగింది ఈ కార్య్కక్రమం.

ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఉన్నట్లు గుర్తించడంతో జలంధర్ పోలీసులు వరుడు, అతని తండ్రిని రిసెప్షన్ పార్టీలోనే అరెస్ట్ చేసారు. పెళ్లి అయిన వెంటనే రిసెప్షన్ కూడా పెట్టుకుని డాన్స్ లు వేసారు. పలువురు అతిథులు పోలీసులను చూసి పార్టీ నుండి పారిపోయారు. ఆదేశాల ప్రకారం, 20 మందికి మించకూడదు అని అక్కడి ప్రభుత్వం చెప్పినా వినకపోవడంతో ఇద్దరిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.