బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు బిగ్ షాక్ తగిలింది. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ పై మధ్యప్రదేశ్ యువకుడు కేసు పెట్టాడు. విక్కీ కౌశల్ తన రాబోయే సినిమా షూటింగులో భాగంగా… ఇండోర్ వీధుల్లో నటి సారా అలీ ఖాన్ తో కలిసి బైక్ పై చక్కర్లు కొట్టాడు. అయితే విక్కీ నడిపిన బైక్ కు ఉపయోగించిన నెంబర్ తనదేనని.. తన అనుమతి లేకుండా నెంబర్ ను ఉపయోగించడం నేరమంటూ ఇండోర్కు చెందిన జై సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక దీనిపై స్పందించిన పోలీసులు… తమకు జై సింగ్ యాదవ్ నుంచి ఫిర్యాదు అందిందని… నెంబర్ ప్లేట్ ను అక్రమంగా ఉపయోగించినట్లు తేలితే మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సినిమా యూనిట్ ఇంకా ఇండోర్ లోనే ఉందని.. వారిని విచారించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ ఇండోర్లో బైక్ పై చెక్కర్లు కొడుతున్న వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.