”త‌లైవి” సినిమాకు షాక్‌..బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో కేసు !

”త‌లైవి” సినిమాకు ఊహించని షాక్‌ తగిలింది. ఈ సినిమా పై బంజరాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. త‌లైవి సినిమా కు హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు త‌ర‌లింపు జరిగినట్లు బంజరాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం అందుతోంది. నిర్మాత‌ విష్ణు వ‌ర్ధన్ ఇందూరి , బ్రిందా ప్రసాద్ యాక్సిస్ బ్యాంక్ పై బం విబ్రి మీడియా కార్తీక్ బంజరాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

త‌న‌కు తెలియ‌కుండానే కుట్ర పూరితంగా మోసం చేస్తూ 75 ల‌క్షలు బ‌దిలీ చేశార‌ని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు కార్తిక్. 2020 ప్రిభ‌వ‌రి 17 మ‌రియు 20 వ తేదిన అవ‌క‌త‌వ‌కలు జరిగాయని అరోప‌ణ‌లు చేశారు కార్తీక్‌. ఈ నేపథ్యం లోనే ఐ.పీ.సి. 405, 406, 415, 417, 418, 420 సెక్షన్స్ పై కేసు న‌మోదు చేయాల‌ని విజ్నప్తి చేశాడు. విబ్రి మీడియా నుంచి విబ్రి మోష‌న్ ఫిక్చర్స్ కి నిధులు మ‌ళ్లించారని ఆరోపించారు. ఈ నెల 6 న ఫిర్యాదు కార్తిక్ ఫిర్యాదు చేయగా.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక కేసు విషయంలో వివరాలు తెలియాల్సి ఉంది.