సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ !

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి సంబంధించిన సాక్షి మీడియా పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయింది. అయితే..ఈ పిటీషన్‌ పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేస్తోంది. సీఎం జగన్ మోహన్‌ రెడ్డి బెయిల్ పై తీర్పు న్యాయస్థానం లో పెండింగ్ లో ఉండగా బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా కథనం రాసిన నేపథ్యం లో పిటీషన్‌ దాఖలు అయింది.

దీని పై కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ నేపథ్యంలోనే సాక్షి ఎడిటర్ మురళి మరియు సీఈఓ వినయ్ మహేశ్వరికి సమన్లు ఇచ్చింది నాంపల్లి సీబీఐ న్యాయ స్థానం. నోటీసులు జారీ చేసిన తరుణంలో నేడు విచారణకు మురళి, వినయ్ మహేశ్వరులు హాజరయ్యారు. అయితే..ఈ సందర్భంగా కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం కోరింది సాక్షి మీడియా. సోమవారం లో గా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.