ఉల్లిగడ్డల లారీ చూసి హైదరాబాద్ లో షాకైన పోలీసులు…!

-

కరోనా కారణంగా ప్రతిచోటా లాక్ డౌన్ అమలులో ఉంది. అన్ని చోట్లా కూడా ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలు అన్ని కూడా మూసివేయడం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీచేసింది. అందరూ కూడా ఏకతాటిపై లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. నిత్యావసర వస్తువుల రవాణా తప్పించి మిగిలిన అన్ని కూడా రద్దు చేయడం జరిగింది.

ఇటువంటి గడ్డు పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అక్రమార్కులు. ఆహార పదార్థాల రవాణాకు లాక్‌డౌన్‌ యెటువంటి నిబంధనలు లేకపోవడంతో అక్రమార్కులు తమ కార్యకలాపాలను యదేచ్చగా సాగిస్తున్నారు. ఉల్లిగడ్డలను తీసుకెళ్లే వాహనాలలో మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నారు. పటాన్‌చెరు పోలీసులు గురువారం అటువంటి ఒక వాహనాన్ని పట్టుకున్నారు. బీదర్‌ నుంచి ఉల్లిగడ్డల సంచులతో హైదరాబాద్‌ బయలుదేరిన వాహనాన్ని ముత్తంగి ఓఆర్ఆర్‌ జంక్షన్‌ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

డ్రైవర్‌ను వాహనం లో ఏం తీసుకెళ్తున్నరు అని ప్రశ్నించగా ఉల్లిగడ్డల సంచులతో వస్తున్నామని అతను చెప్పాడు, అనుమానం వచ్చి పోలీసులు సరుకు మొత్తం దించి చూడగా ఉల్లిగడ్డల సంచుల కింద 45 సంచులు గుట్కా, తంబాకు బయట పడ్డాయి. అవి సుమారు రూ. 4.40 లక్షలు విలువ చేస్తాయని పోలీసులు తెలిపారు. వాటిని బీదర్‌ నుంచి నగరంలోని కొత్తపేటకు తరలిస్తున్నామని ఇద్దరు నిందితులు చెప్పారు. వాహనాన్ని సీజ్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరేశ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news