ప్లాన్ బీ : కేసీఆర్ యూ ట‌ర్న్‌ ‘రాజకీయం’ బీజేపీ ఇరుక్కున్నట్టేనా..

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఫై వ్యతిరేకత పెంచుతుంది. కానీ ఆ వ్యతిరేకత తమ పార్టీపై కాకుండా , దానిని బిజెపి వైపు మళ్లించేందుకు కేసీఆర్ సరికొత్త రాజకీయ ఎత్తుగడకు తెర తీసినట్లు గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తమ రాజకీయ శత్రువుగా మారడంతో పాటు, తమనే పూర్తిగా టార్గెట్ చేసుకున్న బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీని కోసమే సరి కొత్త రాజకీయానికి తెర తీశారు. తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టం పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ వ్యతిరేకతను తనపైకి రాకుండా చేసుకునేందుకు కేసీఆర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం చూస్తే, ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావంతో రైతులు పంట అమ్ముకునేందుకు ఇబ్బంది పడకుండా, ప్రభుత్వం గ్రామాల్లోనే పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ప్రతిసారి ఆ విధంగా చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. అలా చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, రైస్ మిల్లర్లు, పప్పుల మిల్లర్లు కొనుగోలు చేసినట్లుగా ప్రతిసారి ప్రభుత్వం అమ్మకాలు, కొనుగోలు చేయడం సాధ్యం కాదని, వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేదని వెల్లడించింది.

అంతే కాదు.. దేశంలో అమలవుతున్న కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి కాబట్టి ప్రభుత్వం గ్రామాలలో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, టిఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇదంతా తాము తీసుకున్న నిర్ణయం కాదని, కేంద్రం కొత్త గా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రచారం చేసుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం డిసైడ్ అయిపొయింది, దీని ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా, తాము తీసుకున్న నిర్ణయాల కారణంగా బిజెపి చిక్కుల్లో పడే విధంగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ప్రజల మధ్య చర్చ జరిగేలా చేయాలని, బిజెపి పై వ్యతిరేకత పెరిగే విధంగా ఉపయోగించుకోవాలని , తెలంగాణ లో బీజేపీ హవా తగ్గించాలని డిసైడ్ అయినట్టు గా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version