‘ఉరి’లో రాజకీయం… ఎన్నికల కోసమేనా ఈ డ్రామా…?

-

“ఇప్పటి వరకూ నేను రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ 2012లో నా కూతురి కోసం వీధుల్లో ఆందోళన చేసిన కొందరు.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం నిర్భయ మరణంతో ఆడుకుంటున్నారు” నిర్భయ తల్లి ఆశాదేవి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిర్భయ దోషులను ఈ నెల 22 న ఉరి తీసేందుకు గాను ఢిల్లీ కోర్ట్ డెత్ వారెంట్ కూడా జారి చేసిన సంగతి తెలిసిందే.

అయితే దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటీషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండటంతో తాము ఉరి తీయలేమని తీహార్ జైలు అధికారులు కోర్ట్ కి తెలిపారు. ఈ పరిణామం తో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నిర్భయ తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆమె అన్నట్టు దీని వెనుక రాజకీయాలు జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో ఉరి తీస్తే ఆ క్రెడిట్ ఆప్ కి దక్కుతుందని బిజెపి భావిస్తుందట. అందుకే మళ్ళీ కేంద్ర హోం శాఖ వద్దకు క్షమాభిక్ష పిటీషన్ వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి ఢిల్లీ ప్రభుత్వం క్షమాభిక్ష పిటీషన్ రాగానే దాన్ని తిరస్కరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి పంపించింది. అక్కడి నుంచి కేంద్రం హోం శాఖకు వెళ్ళింది. హోం శాఖ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లి అక్కడ కూడా క్షమాభిక్ష రద్దు అయింది.

దీనితో ముందుకి వెళ్ళలేని స్థితిలో తీహార్ జైలు అధికారులు ఉన్నారు. నిర్భయ అత్యాచారం జరిగిన సమయంలో ఢిల్లీ వీధుల్లో అప్పుడు బిజెపి, కేజ్రివాల్ ఇద్దరూ పోరాటం చేసారు. ఇప్పుడు వాళ్ళే ఉరికి అడ్డుపడుతున్నారని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంతోనే ఉరి శిక్ష వాయిదా పడుతుందని ఆరోపించడం గమనార్హం. ఇప్పుడు క్షమాభిక్ష రద్దు అయింది కాబట్టి 14 రోజుల్లో ఉరి తీసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news