అమరావతి: గోదావరి పుష్కరాల నివేదికపై మళ్లీ విచారణ చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరిగాయని విమర్శించారు. సచివాలయానికి, టీడీపీ ఆఫీసుకి తేడా లేకుండా చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ కోసం చంద్రబాబుపై కేసు పెడితే కానీ తమ కేసులు గుర్తు రాలేదా అని నిలదీశారు. సీపీఎస్ రద్దుపై రేపు విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.