3,000 కిలోమీటర్లు పాదయాత్ర
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఈనెల 24వ తేదీన విజయనగరం జిల్లాలోని కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తుంది. తద్వారా కొత్త రికార్డును సృష్టించబోతోంది. ఆ సందర్భంగా అక్కడే భారీ బహిరంగసభ నిర్వహణకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఓ పైలాన్ ను కూడా 3 వేల కిలోమీటర్లకు గుర్తుగా ఏర్పాటు చేస్తున్నారు.
జననేత పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగనున్నాయి.
ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని..
– 116 నియోజకవర్గాల్లో 269 రోజుల పాటు 3,000 కి.మీ పాదయాత్ర.
– 193 మండలాలు, 1650 గ్రామాలు, 7 కార్పొరేషన్లు, 44 మున్సిపాలిటీలు మీదుగా సాగిన యాత్ర.
– 107 సమావేశాలు (కొత్తవలసతో సహా).
– ప్రజలతో వైయస్ జగన్ 41 ముఖాముఖి సమావేశాలు జరిగాయి.