గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక భరోసా ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం వైఎస్ జగన్‌ను పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి కలిసింది. తన ఉన్నత చదువుకు గత ఏడాది జులైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చేసిన సాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి… అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు.
గతంలో జాహ్నవి ఏవియేషన్ శిక్షణకు రూ. 50 లక్షల సాయం అందజేసింది ఏపీ ప్రభుత్వం.ఇప్పటికే నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది జాహ్నవి.భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు సీఎంకి జాహ్నవి వివరించింది. కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా ఆమె వెంట ఉన్నారు.