తిరుపతిలో అఖిల ప్రియ ఎందుకు కనపడటం లేదంటారు…?

-

తిరుపతి పార్లమెంటు పరిధిలో భూమా అఖిలప్రియ ప్రచారం చేయడం లేదు. గత కొన్ని రోజులుగా ఆమె తిరుపతి పార్లమెంటు పరిధిలో కనబడటం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు వస్తున్న కర్నూలు జిల్లా నుంచి తిరుపతి వెళ్లి ఆమె ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించకపోవడం తో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావటం లేదు.

కొన్ని కొన్ని అంశాలను తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ గా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్న అఖిల ప్రియ ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేత కావడం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సమయంలో అనుభవం లేకపోయినా సరే ఆమెకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వడం వంటివి జరిగాయి. అయినా సరే ఇప్పుడు ఆమె పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కనపడక పోవటంతో కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా ఆమె పెద్దగా మాట్లాడటం లేదు అనే భావన కూడా ఉంది. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో నడుస్తుంది. కాబట్టి ఆమె ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. మరి భూమా అఖిలప్రియ అనుకున్న విధంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారా లేక దూరంగా ఉంటారా అనేది చూడాలి. ఆమె ప్రచారం చేయాలని టిడిపి నేతలు కోరుతున్నారు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news