పిల్లాడి శరీరంలో 11 సూదులు.. ఎలా వచ్చాయంటే!

-

మూడేళ్ల బాలుడు నోరు తెరిచి సరిగా అమ్మ అని పిలవలేని వాడు తన శరీరంలోపల అతడు పడుతున్న బాధను ఏవిధంగా బయటకు చెప్పుకోగలుగుతాడు. గత 15 రోజుల నుంచి ఆ చిన్నారి ఏడ్చే ఏడుపుకు ఏమి చేయాలో కూడా ఆ తల్లి దండ్రులకు అర్ధం కాలేదు. అయితే అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయించగా ఆ ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. ఆ చిన్నారి శరీరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సిరంజి సూదులు గుచ్చి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన వనపర్తి లోని వీపనగండ్ల లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… అశోక్,అన్నపూర్ణ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు లోక్ నాథ్. ఆ మూడేళ్ల బాలుడు గత 15 రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తూ విపరీతంగా ఏడుస్తున్నాడు. అంతగా తల్లి దండ్రులు సముదాయించినా కూడా ఆ చిన్నారి ఏడుపు ఆపకపోతుండడం తో తిరగని ఆసుపత్రి లేదు. అయినప్పటికీ ఆ చిన్నారి పరిస్థితిలో ఎలాంటి మార్పు మాత్రం కనిపించలేదు. అయితే బాలుడి మలద్వారం వద్ద నుంచి ఒక సూది ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన బాబును ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు వెంటనే ఆ చిన్నారి శరీరాన్ని ఎక్స్ రే తీశారు. అయితే ఆ ఎక్స్ రే లో ఊహించని విధంగా ఆ చిన్నారి శరీరంలో 11 సూదులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

బాబు పొట్ట,తొడ,పిరుదుల భాగాల్లో ఆ మొత్తం సూదులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి కొన్ని సూదులను బయటకు తీయగలిగారు. అయితే అన్ని సూదులను ఒకేసారి తొలగించడం సాధ్యం కాదని మిగిలిన వాటిని కొంతకాలం తర్వాత తీస్తామని వైద్యులు తెలిపారు. అయితే చిన్నారి పరిస్థితి పై తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.తమ బిడ్డకు ఎవరో ఇది కావాలని చేసి ఉంటారని భావిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version