తెలంగాణాలో కూడా మద్యపాన నిషేధం…? త్వరలో కేసిఆర్ నిర్ణయం…?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హామీల్లో అధికార వైసీపీ ఇచ్చిన ప్రధాన హామీ మద్యపాన నిషేధం… సామాన్యులను మద్యానికి దూరం చెయ్యాలి అనే ఉద్దేశంతో జగన్… తాను ఇచ్చిన హామీని క్రమంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్యని కూడా భారీగా తగ్గిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇక బార్ల లైసెన్సుల విషయంలో కూడా జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తుంది. 40 శాతం తగ్గించే ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ధరలు పెరగడంతో మద్యం అమ్మకాలు కూడా భారీగా తగ్గాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

ఇక బెల్ట్ షాపుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ వస్తుంది. దీని ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా… సామాన్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు. ఇదిలా ఉంటె… ఇప్పుడు దీనిపై తెలంగాణా ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దిశ అత్యాచార ఘటన తర్వాత తెలంగాణా వ్యాప్తంగా మద్యపాన నిషేధం విషయంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ తీసుకున్న విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ ని డిమాండ్ చేస్తున్నారు.

దీనితో కేసిఆర్ సర్కార్ ఇప్పుడు అ విధంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసే ఆలోచన చేస్తుంది తెరాస ప్రభుత్వం. ఇప్పటికే విధివిధానాలను రూపొందించాలి అని కూడా అక్కడి అధికారులకు కేసిఆర్ సూచించారని అంటున్నారు. రాబోయే ఏడాదిలో భారీగా మద్యం షాపులను తగ్గించి… క్రమంగా మద్యపాన నిషేధాన్ని అమలు చెయ్యాలని కేసిఆర్ భావిస్తున్నారట. ఇక బార్ల సంఖ్యను కూడా త్వరలో తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news