వైసీపీ పార్టీ తరఫున ప్రత్యర్థి నేతలకు సెటైర్లు వేయడంలో అసెంబ్లీలో మీడియా సమావేశంలో అంబటి రాంబాబు కు మించిన నాయకుడు మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా సందర్భాలలో అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మీడియా సమావేశంలో చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేసిన అంబటి రాంబాబు తాజాగా ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి అదిరిపోయే రేంజ్ లో సమాధానమిస్తూ వేసిన సెటైర్ల రీ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
మేటర్ లోకి వెళితే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో చేతులు కలిపిన నేపథ్యంలో వైసిపి పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన కామెంట్ లను ఉద్దేశించి నాగబాబు ట్విట్టర్ లో..జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిడి వాడు ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు శుక్రవారం వైసీపీ నేతలపై ఘాటుగా ట్వీట్ చేశాడు.
దీనిపై అంబటి రాంబాబు శనివారం తనదైన శైలిలో ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ‘నేను ‘తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని.. గుర్తించుకున్నందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు. నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను.. రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా…. లేక’ అంటూ నాగబాబుపై తనదైన వ్యంగ్యంతో ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీంతో అంబటి రాంబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మరియు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి.