ఏపీలో అడుగు పెట్టిన అమిత్ షా…? అధికారులు బలైపోయారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేయడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. కొందరు కీలక అధికారులను అది కూడా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. దాదాపు పది మంది అధికారులను సస్పెండ్ చేసారు. ఇంత మంది అధికారులను, కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఈసీ సస్పెండ్ చేయడంతో ఎం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

“గుంటూరు కలెక్టర్ బదిలీ, చిత్తూరు కలెక్టర్ బదిలీ, గుంటూరు ఎస్పీ బదిలీ, చిత్తూరు ఎస్పీ బదిలీ, శ్రీకాళహస్తి డీఎస్పీ బదిలీ, పలమనేరు డీఎస్పీ బదిలీ, మాచర్ల సీఐ సస్పెండ్, తిరుపతి సీఐ సస్పెండ్, పలమనేరు సీఐ సస్పెండ్, రాయదుర్గం సీఐ సస్పెండ్, తాడిపత్రి సీఐ సస్పెండ్” ఒకరకంగా ఎన్నికల సంఘం తీసుకుంది సంచలన నిర్ణయమే. దీనితో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అలజడి మొదలయింది.

అయితే ఇక్కడ అధికారులు బలైపోయారనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఎప్పుడూ రాజకీయ నాయకులే. కాబట్టి అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారుల విషయంలో ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికే హైకోర్ట్ లో డీజీపీ ఒక నెలలో రెండు సార్లు సమాధానం చెప్పారు. ఆయనతో చట్టాలు చదివించే పరిస్థితి ఏర్పడింది.

భవిష్యత్తులో మరికొంత మంది అధికారులు హైకోర్ట్ కి వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యం లేదు. రెవెన్యు అధికారులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కేంద్ర హోం శాఖ ఆదేశాలు లేకుండా ఈ పరిణామాలు జరగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏపీలో కేంద్రం అడుగు పెట్టింది కాబట్టే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఎన్నికల ప్రక్రియ వాయిదా ప్రక్రియ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news