ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ రోశయ్య మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాలకు ఆయన అందించిన సేవలపై అసెంబ్లీ కొనియాడింది. సీఎం జగన్ మాట్లాడుతూ..విద్యార్ధి నాయకుడు నుంచి గవర్నర్ వరకు ఎదిగారని.. ఏ పదవిచ్చినా బాధ్యతతో పని చేశారని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఐదుగురు సీఎంల దగ్గర పని చేశారు. నాన్నగారితో స్నేహ బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించింది సభ.
టీడీఎల్పీ ఉపనే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రోషయ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయ చేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. రోశయ్య మరణాన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదని అన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు మృతి చెందినా గౌరవించామని అన్నారు. రోశయ్య సేవలను గుర్తించేలా ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల రోశయ్య మరణంపై సంతాపం వ్యక్తం చేయకపోవడంపై టీడీపీ అధికార వైసీపీ పార్టీపై విమర్శలు చేసింది. తాజాగా ఈ విమర్శల నేపథ్యంలో రోశయ్య మరణంపై నేడు అసెంబ్లీలో సంతాప తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు.