AP Budget 2019: నేడే ఏపీ బడ్జెట్… ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు?

-

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సీఎం జగన్.. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే.. యువ రాష్ట్రం ఏపీకి చేయాల్సింది చాలా ఉంది. గత ఐదేళ్ల పాటు ఏపీని పాలించిన చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేసిందేమీ లేదు. దీంతో ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మొదటిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సీఎం జగన్.. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే.. యువ రాష్ట్రం ఏపీకి చేయాల్సింది చాలా ఉంది.

గత ఐదేళ్ల పాటు ఏపీని పాలించిన చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేసిందేమీ లేదు. దీంతో ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ.. నిధులకు మాత్రం కటకటే. నవరత్నాల హామీలు, పోలవరం సహా భారీ ప్రాజెక్టుల లక్ష్యాలు చాలా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి పెద్దగా కేటాయింపులేవీ చేయలేదు. దీంతో ఏపీకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తప్పితే మరో ఆదాయం లేదు.

మరోవైపు మద్యం అమ్మకాలపైనా సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. వాటిపై ఆంక్షలు విధించబోతున్నారు. దీంతో భారీగా ఆదాయం తగ్గనుంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్ర బుగ్గన ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెడతారు. మరోవైపు వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి బొత్స అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుండగా… మంత్రి మోపిదేవి శాసన మండలిలో ప్రవేశపెడతారు.

నవరత్నాల హామీలన్నీ నెరవేర్చేడమే లక్ష్యంగా తొలి బడ్జెట్

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా తొలి బడ్జెట్ ను రూపొందించిందట. తొలి బడ్జెట్ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ బడ్జెట్ మాత్రం 28 వేల కోట్లతో రూపొందించారట. అమ్మఒడి, వైఎస్సాఆర్ రైతు భరోసా, పేదల గృహాలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version