మధ్యాహ్నం 12 వరకు ఎవరు సీఎం అవుతారో తెలిసిపోతుందట.. ఏపీ ఈసీ ఏం అన్నారంటే?

-

దేశమంతా ఇవాళ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నా.. ఏపీపైనే అందరి ఆసక్తి. ఏపీలో ఓవైపు అసెంబ్లీ, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అంతే కాకుండా.. కేంద్రంలోనూ చక్రం తిప్పుతానంటున్న చంద్రబాబుకు కూడా ఇది విషమ పరీక్షే. అందుకే.. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది.

ఓట్ల లెక్కింపుపై ఏపీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసందర్భంగా ఏపీ ఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. తర్వాత 8.30కు ఈవీఎం ఓట్లు లెక్కిస్తారు. అయితే.. మధ్యాహ్నం 12 వరకు ఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారని తెలిసిపోతుందని.. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అప్పటి వరకు తెలిసిపోతుందని ఆయన తెలిపారు.

ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం సాయంత్రం దాకా.. ఫలితాలపై క్లారిటీ రాదన్నారు. ఏపీలో 36 కౌంటింగ్ కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సువిధ యాప్, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్‌లో ఫలితాలను చూడొచ్చని ఆయన తెలిపారు. ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం 25 వేల మంది సిబ్బందిని నియమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version