ఆనం, కోటంరెడ్డి ఆరోపణలను తిప్పికొట్టాలి.. నేతలకు జగన్ సూచన

-

నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలంపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. తమ ఫోన్లను ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై.. సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఆర్ఎస్ ఆంజనేయులు, పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ సీఎం భేటీ అయ్యారు. నెల్లూరు రూరల్​కు మరొకర్ని వైసీపీ ఇంఛార్జ్‌గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.

‘ఆనం, కోటంరెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారో అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఐబీ చీఫ్ ఎమ్మెల్యేకు ఎందుకు చెబుతారు. కోటంరెడ్డి పరుషంగా మాట్లాడినవి ఎవరో రికార్డు చేసి ఉండొచ్చు. ఆరోపణలు వస్తే జాగ్రత్తగా ఉండాలని ఐబీ చీఫ్ చెప్పారేమో… ఎవరో ఫోన్ మాట్లాడింది ఆడియో రికార్డు చేస్తే ట్యాపింగ్ అంటున్నారు. అడ్డదారుల్లో వెళ్లడం సీఎం జగన్‌కు తెలియదు. వచ్చే ఎన్నికల్లోవెరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని పార్టీ చూసుకుంటుంది’.- సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు

Read more RELATED
Recommended to you

Latest news