మేనిఫెస్టో పై సీఎం జగన్ కసరత్తు.. ప్రకటన ఎప్పుడు అంటే..?

-

ఇచ్చిన మాటకు సీఎం జగన్ కట్టుబడి ఉంటారని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు.. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నారు.. దీంతో ప్రజలు సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు.. ఈ క్రమంలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్ మరోసారి మేనిఫెస్టో పై దృష్టి పెట్టారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను రూపొందించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఓవైపు పార్టీలో జోష్ నింపేందుకు సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి.. అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారు..

2014, 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో పై ప్రజల స్పందనను ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.. ఈసారి మేనిఫెస్టో అంతకుమించి ఉంటుందనే ప్రచారం పార్టీలో నడుస్తుంది.. నవరత్నాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచేలా జగన్ కసరత్తు చేస్తున్నారట. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ ను విశ్వసిస్తూ ఉండడంతో.. అమలుకు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారని వైసీపీ వర్గాల మాట. టిడిపి మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉందని.. దాన్ని మేనిఫెస్టోలో చేర్చుదామని కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారట.. ఆ హామీ ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపి అవకాశాలు ఉన్నాయని, హామీ ఇచ్చి వెనక్కి తగ్గితే ప్రజలు తమను విశ్వసించరని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని నేతలు చర్చించుకుంటున్నారు.

తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పూర్తిగా విడుదల అయిన తర్వాతే మేనిఫెస్టోని విడుదల చేయాలనే ఆలోచనలో వైసిపి ఉందట. తొలుత రాప్తాడు సిద్ధం సభలోనే వైసీపీ తమ మేనిఫెస్టోని ప్రకటిస్తుందని ప్రచారం జరిగింది.. టీడీపి తో పాటు రాజకీయ వర్గాలు సైతం మేనిఫెస్టో కోసం ఆసక్తిగా ఎదురు చూసాయి. కాని మేనిఫెస్టోని సీఎం జగన్ ప్రకటించలేదు. చంద్రబాబు పూర్తిగా మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాతే వైసీపీ మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఈసారి మేనిఫెస్టోలో అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news