జనసేన పీఏసీ సభ్యులు, హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ తాజాగా వైసీపీలో చేరారు. సీఎం వైస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేగొండి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని నమ్మి గతంలో జనసేనలో చేరాను. పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నాను. కానీ ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు.పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరు.. ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు.
నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు. చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ ని నమ్మి మోసపోయారు. ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు. పీఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు పవన్. ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపి కోవర్టులు అంటూ ముద్ర వేస్తున్నారు. ఏం ఆశించి జనసేన పెట్టారో అర్థం కావటం లేదు అన్నారు. ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను అని తెలిపారు. సలహాలు, సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్ నే చూశానని తెలిపారు. ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది అన్నారు.