చంద్రబాబు గుట్టు బయటపెట్టిన వైసీపీ మంత్రి బుగ్గన..?

-

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటీవల తరచూ ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ సర్కారు అన్ని విషయాల్లోనూ ఫెయిలైందంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా సైన్యం.. జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు తన పాలనా కాలం చివరిలో ఏం చేశారో గుట్టు విప్పారు.

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంపై అప్పుల భారాన్ని 3 లక్షల కోట్లకు పెంచిన గత ప్రభుత్వం వాటిని ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దిందని బుగ్గన ఆరోపించారు. 2014-19 వరకూ సబ్సీడీతో పాటు ఇతర బకాయిలను 14,857 వేల కోట్లమేర పెండింగ్ పెట్టి వెళ్లిపోయారన్నారు. వాటిని తీర్చే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ నష్టాలు 14 వేల కోట్లకు పెరిగాయని బుగ్గన ఆరోపించారు.

ఆదాయం లేకుండా నెల్లాళ్లలో 38 వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. ఎన్నికల ముందు ఏప్రిల్ లో ఒక్కరోజులోనే 5 వేల కోట్ల అప్పు చేశారని.. ఒక్క పౌర సరఫరాల కార్పొరేషన్ పేరుతో 4 వేల పై చిలుకు కోట్ల అప్పు తెచ్చారని బుగ్గన వ్యాఖ్యానించారు. 42 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లారని బుగ్గన విమర్శించారు. మధ్యాహ్న భోజనం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు చెల్లించాల్సిన 9 నెలల వేతనాలు, ఆస్పత్రుల బిల్లులు ఇలా అన్ని పెండింగ్ పెట్టారన్నారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల లో చెల్లింపులు చేసేశారన్నారు.

విద్యుత్ యూనిట్ రేట్లు తగ్గుతాయని తెలిసినా 25 ఏళ్ల కు ఒప్పందాలు చేసుకున్నారని రోజుల వ్యవధిలో 36 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసేశారని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. గత ప్రభుత్వం లో 43 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారని.. ఈ మూడు నెలల్లో తమ ప్రభుత్వం కేవలం 8 రోజుల ఓవర్ డ్రాఫ్ట్ కు మాత్రమే వెళ్ళిందని గుర్తు చేశారు.

విద్యుత్ కోతలు గత ప్రభుత్వం చేసిన పాపమేనని అన్నారు. వాటిని సరిదిద్దేదుకు సమయం పడుతోందని.. మద్యం రేట్లు పెంచటం పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారో తెలీక మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మద్యంపై పెంచిన ధరలు ఏపీ బెవరేజ్ కార్పోరేషన్ కు, ప్రభుత్వానికి వెళ్తాయని చంద్రబాబు గుర్తించాలని ప్రైవేటు కంపెనీలకు కాదని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. దుకాణాల సంఖ్య 20 శాతానికి తగ్గించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news