లంచ్ సమయానికే కుప్ప‌కూలిన సౌతాఫ్రికా..

-

భారత్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట మూడవ రోజు లంచ్ విరామ సమయానికి 6 వికెట్లను కోల్పోయిన సౌతాఫ్రికా కేవలం 136 పరుగులు మాత్రమే చేసి, 465 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్ (52 బ్యాటింగ్: 76 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. ముత్తుసామి (6 బ్యాటింగ్: 12 బంతుల్లో) సహకారం అందిస్తున్నాడు.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు 3, షమీకి రెండు, అశ్విన్ కు ఒక వికెట్ దక్కాయి. ఈశాంత్ శర్మ, జడేజాలు బౌలింగ్ చేసినప్పటికీ, వారికి వికెట్లు దక్కలేదు. ఇక చేతిలో ఉన్న నాలుగు వికెట్లూ పడిపోయేలోపు ఆ జట్టు 265 పరుగులు చేయకుంటే, ఫాలో ఆన్ ఆడించాలన్న వ్యూహాన్ని భారత్ అమలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news