ఏప్రిల్‌ నెల జీతాలు… ఎవరికి ఫుల్, ఎవరికి ఆఫ్!

-

ఒకవైపు కరోనా సమస్య, ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు, మరోపక్క సంక్షేమ పథకాలు నిర్విరామంగా అమలుచేస్తున్న వైనం. ఈ క్రమంలో ఏప్రిల్ నెల వేతనాలు ఎలా చెల్లిస్తాయి ప్రభుత్వాలు అని ఉద్యోగౌలు, ఫెన్షనర్లలో తెగ టెన్షన్ వాతావరణం. ఇంక ప్రైవేటు ఉద్యోగాల జీతాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బడా బడా కంపెనీలు, ప్రముఖ దినపత్రికలు సైతం ఉద్యోగులను తీసేసాయని.. ఉన్నవారికి సగం జీతాలే చెల్లిస్తున్నాయని కథనాలు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నెల జీతాలపై ఏపీ సర్కార్ ఒక తన నిర్ణయం ప్రకటించింది.

లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా… కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో మిగిలిన ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే సగం జీతం చెల్లించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ… ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ నెల పూర్తి పెన్షన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా… గత నెలతో వీరికి 50శాతం పెన్షన్‌ మాత్రమే చెల్లించిన విషయం తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Latest news