జగన్ సర్కారు కౌంటర్ బలంగానే ఉందట!

-

ఏపీలో ఈ మధ్యకాలంలో రాజధాని మార్పు అనంతరం ఆ స్థాయిలో పెను రాజకీయ కలకలానికి తెరతీసిన అంశం ఏదైనా ఉందంటే అది ఖశ్చితంగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు, తదనంతర పరిణామాలు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో నిమ్మగడ్డ పిటిషన్ పై ఏపీ సర్కారు తాజాగా దాఖలు చేసిన కౌంటర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోందనే అంటున్నారు లా పెద్దలు, రాజకీయ విశ్లేషకులు! ఇంతకూ నిమ్మగడ్డ పిటిషన్ కు కౌంటర్ లో జగన్ సర్కార్ ప్రస్తావించిన అంశాలు ఏమిటి.. అవి ఎంతవరకూ క్లారిటీగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం!

  • ఈసీ పదవీ కాలం తగ్గింపు ,మరియు పంచాయతీరాజ్ చట్టంలో మార్పులను గవర్నర్ ఆమోదించిన అనంతరమే ఆర్డినెన్స్ తెచ్చాం.
  • గవర్నర్ నిర్ణయం అనంతరం ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు.
  • 2000 సంవత్సరం తర్వాత అధికారులతో నిర్వహించిన ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి.
  • ఎన్నికల కమిషనర్ సర్వీసు రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్ధాయిలో ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందే.
  • స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం మీడియా తర్వాతే ప్రభుత్వానికి చేరింది.
  • దీనికి కారణం… కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకునే ముందు రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడమే.
  • ఈ రేంజ్ లో ఏపీ సర్కారు హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను చూస్తుంటే… నిమ్మగడ్డ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడం ఖాయమనే వాదనలు బలంగా వినిపిస్తోన్నాయి! వినిపిస్తోంది.
  • కాగా… తనను తొలగించడానికే ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్న నిమ్మగడ్డ రమేశ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఏపీ ప్రభుత్వం అనంతరం పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ.. ప్రభుత్వం తరుపున 24 పేజీల అఫిడవిట్ను హైకోర్టులో దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news