వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు కదా. ఎన్‌ఐఏకు ఎలా అప్పగిస్తారంటూ… ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హోజ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై ఇవాళ వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
కోడి కత్తి కేసుపై విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ.. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. వారం రోజుల పాటు శ్రీనివాసరావు కస్టడీకి అనుమతి తీసుకున్న ఎన్‌ఐఏ… ఐదు రోజుల్లోనే విచారణ పూర్తిచేసింది.
ఏపీ పోలీసుల అత్యుత్సాహం, శ్రీనివాసరావును రాజమండ్రి లేదా వైజాగ్ జైలుకు తరలించాలంటూ ఒత్తిడి చేయడం.. మరో వైపు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఎన్‌ఐఏ నుంచి కేసును విరమించాలని కేసు వేయడం.. ఇవన్నీ చూస్తుంటే సగటు ఏపీ పౌరుడికి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మొదటి నుంచీ తన ప్రాణాలకు హాని ఉందంటూ శ్రీనివాసరావు చెప్పడం.. కేసును ఎన్‌ఐఏకు అప్పగించకుండా.. ఏపీ పోలీసులకు అప్పగించాలంటూ హైకోర్టులో కేసు వేయడం చూస్తుంటే.. జగన్ దాడి వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నట్టుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.