ఎన్నికలు ముగిశాయి.. ఇక ఏ గొడవలూ ఉండవు అని అనుకుంటున్న తరుణంలో భూమా అఖిల ప్రియ భర్తకు చిక్కులు తప్పట్లేవు. ఆమె భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్ తప్పదంటున్నారు.
ఆళ్లగడ్డ.. ఫ్యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్. అక్కడ ఫ్యాక్షన్ ఇప్పుడు వేళ్లూనుకున్నది కాదు. దశాబ్దాల క్రితమే అక్కడ ఫ్యాక్షన్ పుట్టింది. భూమా నాగిరెడ్డి తండ్రి కాలం నుంచే భూమా కుటుంబానికి, గంగుల కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. తరాలు మారిన వాళ్ల ఫ్యాక్షన్ గొడవలు మాత్రం మారడం లేదు. అవి కూడా అలాగే పెరిగి పెద్దవుతున్నాయి.
అవి ఇప్పుడు ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ మెడకు చుట్టుకున్నాయి. ఈసారి కూడా ఆమె టీడీపీ నుంచి ఆళ్లగడ్డ తరుపున పోటీ చేశారు. దీంతో ఆ కుటుంబం ప్రత్యర్థి గంగుల భీజేంద్ర రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. దీని వల్ల ఆళ్లగడ్డలో మరోసారి యుద్ధ వాతావరణం కనిపించింది. ఎన్నికలు ముగిశాయి.. ఇక ఏ గొడవలూ ఉండవు అని అనుకుంటున్న తరుణంలో భూమా అఖిల ప్రియ భర్తకు చిక్కులు తప్పట్లేవు. ఆమె భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్ తప్పదంటున్నారు.
అసలు… భూమా కుటుంబం గొడవలకు, భార్గవ్ కు ఎటువంటి సంబంధం లేదు కానీ… ఇటీవల ఆళ్లగడ్డలో జరిగిన ఘర్షణలు తెలుసు కదా. గంగుల, భూమా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నది. ఆ సమయంలో వాళ్లను ఆపడానికి వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై 90 మందిపై హత్యాయత్నం కింద కేసు పెట్టారు పోలీసులు. ఈ కేసులో భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక, అఖిల భర్త భార్గవ్ రామ్ పై కూడా పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. దీంతో వీళ్లను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారట పోలీసులు.
అయితే.. తమను అరెస్ట్ చేయకూడదని.. భార్గవ్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ కూడా వేసినప్పటికీ… గొడవలంటే తెలియని భార్గవ్ కు అఖిల ప్రియ వల్ల చిక్కులు తప్పేలా లేవని ఆళ్లగడ్డ ప్రజలు అనుకుంటున్నారు.