4 గంటలకు ప్రెస్ మీట్.. ఎవరాపుతారో చూస్తా.. అర్దరాత్రి వర్మ ట్వీట్స్ హల్ చల్..!

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఏపిలో రిలీజ్ కు క్లియరెన్స్ వచ్చింది. సినిమాను మే 1న ఏపిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ గా ఓ ఈవెంట్ ప్లాన్ చేయగా ఎవరు ఈవెంట్ కు ఛాన్స్ ఇవ్వట్లేదట. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను గతంలో రిలీజ్ కాకుండా అడ్డుపడిన వారే ఈ సినిమా ఏపి ప్రమోషన్స్ లో కూడా అడ్డుపడుతున్నారని వర్మ మిడ్ నైట్ ట్వీట్ చేశాడు.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటెల్ లో నిర్ణయించాం.. కాని ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో అది క్యాన్సిల్ చేసేశారు. ఎంత ట్రై చేసినా సరే హోటల్స్, క్లబ్బులు, మేనేజ్ మెంట్స్ ఇవన్ని మనందరికి తెలిసిన ఓ వ్యక్తి భయంతో జడుసుకుంటున్నారు అని చెబుతూ కుట్రల వెనుక కుట్రలు అనే పోస్టర్ ను రిలీజ్ చేశారు ఆర్జివి.

అందుకే పైపుల్ రోడ్డులో ఎన్.టి.ఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా.. మీడియా మిత్రులకి, ఎన్.టి.ఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో ఇంతో ఇష్టమున్న ప్రతి ఒక్కరికి.. నిజాన్ని గౌరవించే ప్రజలందరికి మీటింగ్ లో పాల్గొనడానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ ప్రెస్ మీట్ లొకేషన్ షేర్ చేశారు వర్మ. మొత్తానికి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాకు ఏపిలో కూడా హైప్ వచ్చేలా ఆర్జివి ప్రమోషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రా ప్రేక్షకులు కూడా చాలామంది ఈ సినిమా చూశారు. మరి ఈరోజు ప్రెస్ మీట్ సవ్యంగా సాగుతుందో లేదో చూడాలి.