ఆ చెత్త మాకెందుకు… ఆ ఎమ్మెల్యేలపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో పర్యటిస్తున్నారు. వినూత్న హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా పార్టీ మారి ఆప్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ లో చేరేందుకు దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని.. అయితే ఆ చెత్త మాకెందుకు… వారిని చేర్చుకోవడం అనవసరమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్​లో పర్యటించిన కేజ్రీవాల్​.. అమృత్​సర్​లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు వస్తున్నాయి.. సాధారణంగా ఎన్నికల ముందు పార్టీలు మారడం సహజం. తమ పార్టీలోకి చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. అయితే వారి అవసరం మాకు లేదని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉంటే ఆప్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న నలుగురు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.