మోడీ యొక్క తీరుపై అస్సాం, కేరళ, పుద్దూచేరి ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే …?

-

ప్రధాని నరేంద్ర మోడీ నేడు covid-19 వ్యాక్సిన్ ని తీసుకున్నారు. ఇది రాజకీయ స్లగ్‌ఫెస్ట్ కి దారి తీసుకు వచ్చింది. అస్సాం, కేరళ, పుద్దూచేరి నుండి అపోజిషన్ మోడీని ప్రశ్నించారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మోడీ యొక్క తీరు గురించి చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ వేసేటప్పుడు మోడీ వేషధారణను, నర్సులు రావడం వంటివి వివరించడం జరిగింది. పుదుచ్చేరికి చెందిన నర్స్ నివేదా భారత్ బయోటెక్ యొక్క వ్యాక్సిన్ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఇవ్వడం జరిగింది. మోడీ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో లో నర్స్ పీ. నివేద తో పాటు కేరళ కి చెందిన రెండవ నర్స్ ని కూడా ఆ ఫోటో లో మనం చూడవచ్చు.

వ్యాక్సిన్ ఇచ్చే సమయం లో ‘అస్సామీస్ గామోచ’ ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఢిల్లీ AIIMS లో ఇది జరిగింది. ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రధాని మోడీ తెల్లవారు జామునే ఆస్పత్రికి వెళ్లారు. ఏ రోడ్ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఇది ఇలా ఉండగా భారత దేశం లో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి అయితే కొవాక్సీన్ అయినా అవ్వొచ్చు లేదా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. దీనిని సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. .

ఆస్ట్రోజనీకా వెబ్ సైట్ లో ప్రచురించిన డేటా ప్రకారం 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలు వాళ్ళకి ఈ వ్యాక్సిన్ మంచిది. కానీ అరవై నాలుగు సంవత్సరాలు దాటిన వాళ్లకి అది పెద్ద ప్రభావితం చేయడం లేదు అని జర్మన్ గవర్నమెంట్ చెప్పడం ప్రశ్నించింది. అయితే పీఎం మోడీ కొవేక్సిన్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ ఎంపీ ఈ ప్రశ్న కు సంబంధించి క్లియర్ చేయాలని అన్నారు. కొవాక్సీన్ డీజీసిఐ చేత అత్యవసర వినియోగ అనుమతి పొందిన రెండవ వాక్సిన్. ఈ కోవ్యాక్సిన్ హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news