జయప్రదపై అస‌భ్య‌క‌ర‌ వ్యాఖ్యలు…

54

ఎన్నికల వేళ ఒక పార్టీ నాయకుడిపై మరో పార్టీ నాయకుడు దుమ్మెత్తి పోయడం సహజమే. కానీ.. ఈ రీతిలోనా. ఇదివరకు సమాజ్ వాదీ పార్టీలో ఉన్న జయప్రద.. తర్వాత బీజేపీలో చేరారు. ఇదివరకు తను ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ నుంచే ఇప్పుడు కూడా పోటీకి దిగారు.

అందరిది ఒక బాధ అయితే.. వీళ్లది ఇంకో బాధ అన్న చందంగా తయారైంది జయప్రద, అజాంఖాన్ వ్యవహారం. ఉత్తరప్రదేశ్‌లో తలపడుతున్న జయప్రద, అజాంఖాన్‌ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రం అవుతోంది. ఇదివరకు వాళ్లిద్దరూ ఒకే పార్టీలో ఉన్నవాళ్లే. ఇప్పుడు మాత్రం వేర్వేరు పార్టీలో ఉండి.. రాంపూర్ నుంచి ఇద్దరూ పోటీకి దిగారు. తనపై దాడి చేస్తానని హెచ్చరించారని… తనపై యాసిడ్ కూడా పోస్తానంటూ బెదిరించారని జయప్రద.. అజాంఖాన్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Azam khan shocking comments on jayaprada

దానిపై అజాంఖాన్ ఘాటుగా స్పందించారు. జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రదను రాంపూర్ ఎవరు తీసుకొచ్చారు. ఆమెను నేను రాంపూర్ తీసుకొస్తే.. ఆమె మాత్రం ఖాకీ అండర్ వేర్ ధరించిందని నేను గుర్తించలేకపోయా.. అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అంతే కాదు.. ఆమె గొప్ప నాట్యగత్తె అని.. ఆమెను 17 ఏళ్ల పాటు ఎవరూ టచ్ చేయకుండా కాపాడుకుంటూ వచ్చింది నేనే.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక మహిళా నేత పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అజాంఖాన్‌కు సిగ్గు లేదూ అంటూ పలువురు మండిపడుతున్నారు.ఎన్నికల వేళ ఒక పార్టీ నాయకుడిపై మరో పార్టీ నాయకుడు దుమ్మెత్తి పోయడం సహజమే. కానీ.. ఈ రీతిలోనా. ఇదివరకు సమాజ్ వాదీ పార్టీలో ఉన్న జయప్రద.. తర్వాత బీజేపీలో చేరారు. ఇదివరకు తను ప్రాతినిధ్యం వహించిన రాంపూర్ నుంచే ఇప్పుడు కూడా పోటీకి దిగారు.