రాజ‌ధాని రైతుల సెగ‌లో బాబు ఉక్కిరి బిక్కిరి…

-

రాజధాని అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. అధికారం కోల్పోయాక తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ వర్గానికి చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక వారిని నిలువరించేందుకు టీడీపీ శ్రేణులు కూడా ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు చెప్పులు, రాళ్ళతో దాడులు చేశారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఇక చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారు.

ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు విసిరారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన రైతులు బాబుకు ఘనస్వాగతం కూడా పలుకుతున్నారు.
అయితే ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడానికి చంద్రబాబే కారణమని చెప్పొచ్చు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న బాబు రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఫుల్ గ్రాఫిక్స్ చూపించి తమని మోసం చేశారని కొందరు రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

అలాగే తమకు సరైన ఫ్లాటులు కూడా కేటాయించలేదని, టీడీపీ నేతలే దాదాపు 9 వేల ఎకరాలు వరకు కొన్నారని అంటున్నారు. ఇక కట్టిన కట్టడాలు కూడా తాత్కాలికంగానే కట్టి తమని మోసం చేసిన బాబు…తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటు వైసీపీ మంత్రులు కూడా గత కొన్ని రోజులుగా అమరావతి నిర్మాణంలో బాబు మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

ఇక వీరి వెర్షన్ ఇలా ఉంటే టీడీపీకి చెందిన అమరావతి రైతులు మాత్రం చంద్రబాబు తమని మోసం చేయలేదని, మంత్రులు మాటలు సరిగా లేవని ఫైర్ అవుతున్నారు. బాబుని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీకి చెందిన రైతులు అంటున్నారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. మొత్తానికైతే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయకుండా ఇప్పుడు అమరావతిలో పర్యటించడం పట్ల బాబుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకిత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news