జమ్మలమడుగు లో ఆదినారాయణరెడ్డి కి బిగ్ బ్యాడ్ న్యూస్ ?

-

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి వైసీపీ పార్టీలో చేరడంతో కడప రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గతంలో రామసుబ్బారెడ్డి మరియు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కలసి పని చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు రామ సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం తో ఆదినారాయణ రెడ్డి కి షాక్ తో పాటు బిగ్ బాడ్ న్యూస్ అయ్యింది. రాజకీయంగా కడప జిల్లాలో వైయస్ కుటుంబం తర్వాత వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినబడేవి.Image result for adinarayana reddyకొన్ని దశాబ్దాల పాటు రామసుబ్బారెడ్డి టిడిపిలో ఉంటూ సేవలందించాడు. ఇదే విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చారు. నేను అనేక కష్టాలను ఎదుర్కొన్నాను, జైల్లో ఉన్నాను,  తెలుగుదేశం పార్టీ కోసం బాగా పని చేశాను, అలాంటిది చెప్పుడు మాటలు విని నన్ను పార్టీలో చంద్రబాబు అవమానించారని తన బాధ వెళ్లగక్కారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది అనే టాక్ నడుస్తుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి అతి తక్కువ టైమ్ లోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోని మంత్రి అవ్వటం జరిగింది. దీంతో పార్టీని జగన్ ని మోసం చేసిన ఆదినారాయణరెడ్డి 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఆ తరువాత బిజెపి పార్టీలో చేరారు. తాజాగా తన తోటి నాయకుడు రామసుబ్బారెడ్డి వైసిపి పార్టీ లోకి రావడంతో…కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి కి రాజకీయంగా బ్యాడ్ డేస్ స్టార్ట్ అయినట్లే అని చాలామంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news