బక్కచిక్కిన టీడీపీని ‘బక్కని’ బ్రతికిస్తారా?

-

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడుగా బక్కని నర్సింహులు ఎంపికైన విషయం తెలిసిందే. మొన్నటివరకు అధ్యక్షుడుగా పనిచేసిన ఎల్ రమణ టీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో చంద్రబాబు, బక్కని నర్సింహులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.  అయితే తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ చాలా దారుణమైన కష్టాల్లో ఉంది. దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది.

TDP-Party | టీడీపీ
TDP-Party | టీడీపీ

తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న నాయకులంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ టీడీపీకి భవిష్యత్ లేదని చెప్పి దాదాపు 90 శాతంపైనే నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. నాయకులే కాదు క్యాడర్ కూడా పార్టీకి దూరమైంది. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్తితుల నేపథ్యంలో క్యాడర్ కూడా చేజారింది. కానీ ఇలాంటి పరిస్తితుల్లో అధ్యక్ష పీఠంలో కూర్చున్న బక్కని నర్సింహులు, పార్టీని ఏ మేర బలోపేతం చేస్తారు అంటే చెప్పలేని పరిస్తితి ఉంది.

నిజాయితీ, నిబద్ధత గల నాయకుడుగా బక్కనికు పేరుంది. పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా, పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే పనిచేస్తూ వస్తున్నారు. దళిత వర్గానికి చెందిన బక్కనికి పార్టీలకు అతీతంగా మంచి పేరుంది. ఇలా ఎలాంటి మచ్చలేని నాయకుడుగా ఉన్న బక్కని, రానున్న రోజుల్లో టీడీపీని ఎంతవరకు బలోపేతం చేస్తారో చూడాలి.

అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల్లో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య టీడీపీ పుంజుకోవడం అసాధ్యం. కాకపోతే ఇప్పటికి ఆ పార్టీని అభిమానించేవారు రాష్ట్రంలో ఉన్నారు. కానీ అనివార్య పరిస్తితుల్లో వారు వేరే పార్టీలకు ఓటు వేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటినుంచైనా టీడీపీ నాయకత్వం బలపడితే వారు కూడా పార్టీకి దగ్గరయ్యే పరిస్తితి ఉంటుంది. లేదంటే ఇలాగే కాలం గడపటమే.

Read more RELATED
Recommended to you

Latest news